సూర్య సినిమాకు అప్పుడే రీమేక్ ఆఫర్.!

Published on Oct 29, 2020 11:05 pm IST

మన తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలలో ఉన్న హీరోల్లో మోస్ట్ లవబుల్ హీరో ఎవరన్నా ఉన్నారంటే ఆ జాబితాలో సూర్య పేరును చాలా మంది చెబుతారు. అయితే బయట ఎంత కామ్ గా సూర్య ఉంటారో సినిమాల్లో అంతే పవర్ ఫుల్ గా ఉంటారు. ఒక్క నటనతోనే కాకుండా వినూత్న సినిమాలతో మంచి ఆదరణను రాబట్టుకున్న సూర్య నటించిన మరో ప్రయోగాత్మక చిత్రం “ఆకాశమే నీ హద్దురా”.

వచ్చే నెల దీవాళీ కానుకగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజా సమాచారం ఒకటి తెలుస్తుంది. ఇంకా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి హిందీ రీమేక్ కు బాలీవుడ్ లో చర్చలు మొదలయ్యినట్టు తెలుస్తుంది అంతే కాకుండా ఈ చిత్రానికి గాను సుధా కొంగరనే దర్శకత్వం వహించనున్నారట. మరి హిందీ వెర్షన్ లో ఎవరు ఎవరు హీరోగా కనిపిస్తారో అన్నది చూడాలి. ఇప్పటికే సూర్య నటించిన సింగం రీమేక్ అక్కడ ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More