విడాకుల్లో ‘భరణం’ వద్దన్న ‘అమలాపాల్’
Published on Aug 6, 2016 8:32 pm IST

Amala-Paul-and-Vijay
ప్రస్తుతం తమిళ పరిశ్రమలో నటి ‘అమలా పాల్’, దర్శకుడు ‘విజయ్’ ల విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అభిప్రాయభేదాల కారణంగా చాలా రోజులుగా విడివిడిగా ఉంటున్న ఈ ఇద్దరు తాజాగా పరస్పర అంగీకారం మీద విడాకులకు అప్లై చేసుకున్నారు. ఈ విడాకుల పిటిషన్ లో అమలా పాల్ తన భర్త విజయ్ నుండి ఎటువంటి భరణాన్ని కూడా కోరుకోలేదు.

కొన్నాళ్లుగా విడిగా ఉంటున్న ఈ జంటకు కోర్ట్ మరో 6 నెలలు గడువిచ్చింది. ఈ 6 నెలల లోపు వాళ్ళు తమ మధ్య ఉన్న విభేదాలను గనుక తెలుసుకోలేకపోతే కోర్ట్ వాళ్లకు విడాకులు మంజూరు చేస్తుంది. ఈ అంశంపై కొన్ని రోజుల క్రితమే విజయ్ బయటికొచ్చి విడకుల్లో తన తప్పేమీ లేదని చెప్పిన సంగతి తెలిసిందే.

 
Like us on Facebook