‘ఆమె’లో కాన్సెప్ట్, విజువల్స్ హైలెట్ – అమలా పాల్

Published on Jul 16, 2019 10:50 pm IST

అమలాపాల్ ”ఆమె” అనే థ్రిల్లర్‌ సినిమాతో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రత్నకుమార్‌ దర్శకత్వంలో రాంబాబు కల్లూరి, ఎం. విజయ్‌ నిర్మించిన ఈ తమిళ చిత్రం తెలుగు హక్కులను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సొంతం చేసుకుని తెలుగులో విడుదల చేస్తున్నారు. కాగా తాజాగా అమలా పాల్ ఈ సినిమాకి సంబంధించి మీడియాతో మాట్లాడింది.

అమలాపాల్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకి మేం బడిన కష్టానికి ఖచ్చితంగా సరైన ఫలితమే వస్తోందని నమ్ముతున్నాం. ముఖ్యంగా కొత్త కాన్సెప్ట్స్ పై ఆసక్తి చూపే ప్రేక్షకులకు మా ఈ ప్రయత్నం బాగా నచ్చుతుంది. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే.. ఈ మూవీ కి కాన్సెప్ట్ నే మెయిన్.. అలాగే కాన్సెప్ట్ తో పాటు విజువల్స్ కూడా ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. సినిమాలో ఎమోషన్ తో పాటు విలువైన మెసేజ్ కూడా ఉంది. అయితే టీజర్ లో నా న్యూడ్ షాట్స్ పై కొంతమంది కొన్ని విమర్శలు చేశారు. వారందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా.. ఆ సన్నివేశాల్లో నా నగ్నత్వం కంటే.. ఓ అమ్మాయి పడే బాధను చూడండి. అది మిమ్మల్ని ఎమోషనల్ గా టచ్ చేస్తోంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని గట్టి హోప్స్ తో ఉన్నాం అని అమలాపాల్ చెప్పుకొచ్చింది.

ఇక సినిమాలో స్క్రీన్ ప్లే చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. మరి అమలాపాల్ కి ఈ సినిమా భారీ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More