‘లైలా ఓ లైలా’ కోసం స్లిమ్ అయిన అమలా పాల్.

‘లైలా ఓ లైలా’ కోసం స్లిమ్ అయిన అమలా పాల్.

Published on Oct 28, 2014 7:53 PM IST

amala-paul
పెళ్ళైన తర్వాత సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది అమలా పాల్. గతంలో గ్లామరస్ పాత్రలలో నటించినా.. ప్రస్తుతం నటనకు ఆస్కారమున్న పాత్రలు, తనకు మంచి పేరు తీసుకొచ్చే సినిమాలలో మాత్రమే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. మాతృభాష మలయాళంలో మోహన్ లాల్ సరసన ‘లైలా ఓ లైలా’ మరియు ‘మిల్లి’ అనే రెండు సినిమాలలో నటిస్తుంది. ‘లైలా ఓ లైలా’ సినిమా కోసం అమలా పాల్ చాలా బరువు తగ్గింది. స్లిమ్ గా తయ్యారయ్యింది.

‘లైలా ఓ లైలా’ సినిమాలో నా పాత్ర రెండు మూడు వేరియేషన్‌ లతో కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో టైటిల్ సాంగ్ కోసం స్లిమ్ గా తయారయ్యాను. సినిమాకి ఈ పాట టర్నింగ్ పాయింట్‌. అందుకే కష్టపడాల్సి వచ్చింది. ఛాలెంజ్ గా ఫీలయ్యి బరువు తగ్గాను. మరో మలయాళ సినిమా ‘మిల్లి’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర నా వ్యక్తిగత జీవితానికి కొంచం దగ్గరగా ఉంటుంది. అని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అమలా పాల్ చెప్పింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు