మాస్ రాజా అభిమానులకు బ్యాడ్ న్యూస్ !

Published on Sep 17, 2018 3:42 pm IST


మాస్ మహారాజ్ రవితేజ, శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అక్టోబర్ 5న విడుదలకానుంది ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు వస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదాపడింది. డిసెంబర్ 14న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. మరి ఈ సినిమా విడుదల రెండు నెలలు ఆలస్యం కావడం ఫై కారణాలేంటో తెలియాల్సి వుంది.

ఇక ప్రస్తుతం ఈచిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన ఇలియానా కథానాయికగా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :