‘అమర్ అక్బర్ ఆంటోనీ’ఆ రోజే రానున్నాడా ?

Published on Jul 10, 2018 11:18 pm IST

‘నేల టిక్కెట్టు’ చిత్రం తరువాత మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతుంది. గత కొంత కాలంగా తెలుగు తెరకు దూరమైన ప్రముఖ హీరోయిన్ ఇలియానా మళ్ళి ఈ చిత్రంతోనే రీ ఎంట్రీ ఇస్తుంది. శ్రీను వైట్ల దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుందని సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది .

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది . ఇక గత కొంత కాలంగా పరాజయాలతో సతమవుతున్న రవితేజ మరియు శ్రీను వైట్లకు ఈ చిత్ర విజయం కీలకం కానుంది.

సంబంధిత సమాచారం :