డిజిటల్ రైట్స్ లో రికార్డు క్రియేట్ చేసిన స్టార్ హీరో..!

Published on Dec 5, 2019 5:56 pm IST

తలపతి విజయ్-అట్లీ కాంబినేషన్ లో వచ్చిన బిగిల్ మూవీ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం తమిళ మరియు తెలుగు భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డొమెస్టిక్ గా 200కోట్ల వసూళ్లు సాధించిన హీరోగా విజయ్ ఈ చిత్రంతో మొదటిసారి బిగిల్ సినిమాతో ఈ క్లబ్ లో వచ్చి చేరారు. గతంలో సౌత్ నుండి రజిని, ప్రభాస్, యష్ మాత్రమే డొమెస్టిక్ గా 200కోట్ల వసూళ్ల సాధించిన హీరోలుగా ఉన్నారు.

కాగా బిగిల్ మూవీ మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. బిగిల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రఖ్యాత అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీని కొరకు భారీ ధర చెల్లించారని సమాచారం. ఇప్పటి వరకు ఏ తమిళ చిత్ర డిజిటల్ రైట్స్ కొరకు ఇంత మొత్తంలో డీల్ జరగలేదని సమాచారం. తెలుగులో విజిల్ గా విడుదలైన ఈ చిత్రంలో విజయ్ రెండు విభిన్న పాత్రలలో కనిపించారు. నయనతార విజయ్ కి జంటగా నటించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

More