ముచ్చింతల్‌లో అంబికా సంస్థ నూతన ఉత్పత్తి ‘రాగస్వర సుప్రభాతం’ ప్రారంభం

ముచ్చింతల్‌లో అంబికా సంస్థ నూతన ఉత్పత్తి ‘రాగస్వర సుప్రభాతం’ ప్రారంభం

Published on Dec 30, 2025 8:00 AM IST

Ambika Durbar Bathi

ప్రముఖ అగర్బత్తి బ్రాండ్ అంబికా సంస్థ తన సరికొత్త ఆవిష్కరణ ‘రాగస్వర సుప్రభాతం’ను ముక్కోటి ఏకాదశి పర్వదినాన మార్కెట్లోకి విడుదల చేసింది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారు ఈ నూతన ఉత్పత్తిని ఆవిష్కరించి, సంస్థ ప్రతినిధులకు ఆశీస్సులు అందజేశారు. 108 దివ్యదేశాల సముఖంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ, డైరెక్టర్లు అంబికా రామచంద్రరావు, కార్తీక్ ఆలపాటి పాల్గొన్నారు.

​ఈ ‘రాగస్వర సుప్రభాతం’ అగర్బత్తి బాక్స్ అత్యంత వినూత్నంగా రూపొందించబడింది. భక్తులు ఈ బాక్స్‌ను తెరిచిన వెంటనే ఆటోమేటిక్‌గా ఐదు నిమిషాల పాటు ‘శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం’ వినిపించడం దీని ప్రత్యేకత. కేవలం పరిమళమే కాకుండా, శ్రవణానందాన్ని కలిగించే మ్యూజికల్ మెకానిజంతో దీనిని తయారు చేశారు. అగర్బత్తులు అయిపోయిన తర్వాత కూడా ఈ బాక్స్‌ను పూజా గదిలో మ్యూజిక్ ప్లేయర్‌గా వాడుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

​ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ, 125 ఏళ్లుగా నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్న అంబికా సంస్థ భక్తులకు భగవంతుడికి మధ్య అనుసంధానకర్తగా నిలిచిందని ప్రశంసించారు. అంబికా కృష్ణ మాట్లాడుతూ, రామానుజాచార్యుల సన్నిధిలో ఈ ఉత్పత్తిని విడుదల చేయడం తమ అదృష్టమని పేర్కొన్నారు. త్వరలోనే వారం రోజులకు సరిపడా ఏడు రకాల సువాసనలతో కూడిన ప్యాక్‌లను కూడా విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఉత్పత్తులు త్వరలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు