‘7 డేస్‌ 6 నైట్స్‌’ షూట్ పై ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ !

Published on Aug 16, 2021 2:00 pm IST

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌. రాజు దర్శకుడిగా ‘డర్టీ హరి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం అందించిన విజయోత్సాహంతో ఆయన మళ్ళీ ‘7 డేస్‌ 6 నైట్స్‌’ అనే మరో ఇంట్రస్టింగ్ సినిమా చేస్తున్నారు. కాగా గోవాలో 100 మంది సభ్యుల యూనిట్ సహకారంతో 4 కెమెరాలతో ప్రధాన షెడ్యూల్‌ ను పూర్తి చేశారు. అన్ని భద్రతా చర్యలను అనుసరించి లాస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు.

ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను మంగళూరు & ఉడిపిలో ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని గ్రాండ్ రిలీజ్ చేయాలని లక్ష్యంగా టిమ్ పని చేస్తోంది. వైల్డ్‌ హనీ ప్రొడక్షన్‌ పతాకంపై ఎంఎస్‌ రాజు తనయుడు, నటుడు సుమంత్‌ అశ్విన్‌, ఎస్‌. రజనీకాంత్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుందట.

అలాగే న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నేపథ్యంలో సాగుతుందట. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పతాకంపై సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో. వింటేజ్ పిక్చర్స్ & ఆభ్ఘ్ క్రియేషన్స్ సహకారంతో సుమంత్ అశ్విన్ మరియు రజనీకాంత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :