‘అమిగోస్’ కళ్యాణ్ అన్న కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్

Published on Feb 5, 2023 11:48 pm IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అమిగోస్. భారీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ మూవీ నుండి ఇప్పటికే జీబ్రాన్ అందించిన సాంగ్స్ తో పాటు టీజర్, ట్రైలర్ అన్ని కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక నేడు ఈమూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఎంతో వైభవంగా జరిగింది.

ఇక ఈ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ, అన్నయ్య కళ్యాణ్ రామ్ తమ నందమూరి ఫ్యామిలీ లో అత్యధికంగా ప్రయోగాత్మక సినిమాల్లో నటించిన హీరో అని అన్నారు. ఇక దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఈ మూవీని ఎంతో అద్భుతంగా తెరకెక్కించినట్లు మనకి ట్రైలర్ ని చూస్తే అర్ధం అవుతుందని, అలానే తప్పకుండా అమిగోస్ మూవీ నందమూరి కళ్యాణ్ రామ్ అన్నయ్య కెరీర్ లో పెద్ద మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోవడం ఖాయం అంటూ అభిప్రాయపడ్డారు. కళ్యాణ్ రామ్ తొలిసారిగా ట్రిపుల్ రోల్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :