హ్యాక్ కి గురైన మెగాస్టార్ ట్విట్టర్ , ప్రొఫైల్ పిక్చర్గా పాకిస్తాన్ పీఎం ఫొటో.

Published on Jun 11, 2019 8:32 am IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ని సోమవారం రాత్రి హ్యాక్ చేయడంతో ఆయన కొంచెం గందరగోళానికి గురయ్యారు. ఈ దుశ్చర్యకు టర్కీ కి చెందిన ఆయిల్ డిజ్ టిమ్ అనే హ్యాకర్ పాల్పడ్డాడు. ఇతడు అమితాబ్ అకౌంట్ ని హ్యాక్ చేయడంతో పాటు ప్రొఫైల్ పిక్చర్ గా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటో పెట్టడం గమనార్హం. అమితాబ్ బయోడేటా లో “ఐ లవ్ పాకిస్తాన్” అనే స్లోగన్ తో పాటు, టర్కిష్ జాతీయ పతాకం ఉన్న ఎమోజి ని చేర్చారు.

ఈ విషయం గమనించిన అమితాబ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో పాటు, సదరు బయోడేటా, ప్రొఫైల్ పిక్చర్ ని తొలగించారు. ఐతే టర్కీ కి చెందిన ఈ హ్యాకర్ గ్రూప్ ఇలాంటి సైబర్ అటాక్స్ ఇంకా జరుగుతాయని ఓ బెదిరింపు ట్వీట్ చేయడం గమనార్హం.

సంబంధిత సమాచారం :

More