అరవిందలో అమితాబ్ బచ్చన్ ఉన్నాడా ?

Published on Sep 11, 2018 12:37 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ప్రచార చిత్రం విడుదలవ్వనుంది. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే అరవింద సమేతలో ఓ ప్రత్యేకమైన పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారట. అయితే ఈ వార్తకు సంబంధించి చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. కాగా అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి అంచనాలను అరవింద అందుకోగలడో లేడో చూడాలి.

సంబంధిత సమాచారం :