రైతులను రుణ విముక్తుల్ని చేసిన అమితాబ్

Published on Jun 13, 2019 2:30 am IST

దేశంలో రైతుల పరిస్థితి దయనీయం. ఎంత కష్టపడినా సరైన దిగుబడి రాక, ఒకవేళ వచ్చినా గిట్టుబాటు ధర లేక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మాభిమానం కలిగిన రైతులు ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వేలల్లో ఆత్మ హత్యలకు పాల్పడి కుటుంబాలను అనాథలను చేస్తున్నారు. ఈ పరిస్థితి గమనించిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్ . పోయిన సంవత్సరం ఉత్తరప్రదేశ్‌కు చెందిన వెయ్యి మంది రైతుల రుణాలను చెల్లించిన అమితాబ్‌..బుధవారం మరో రెండు వేల మందికి పైగా రైతుల అప్పులను తీర్చేశారు.

ఈ రైతులంతా బిహార్‌కు చెందినవారు. బిహార్‌కు చెందిన మొత్తం రైతుల్లో అప్పులు తిరిగి తీర్చలేని స్థితిలో ఉన్న 2100 మంది రైతులను ఎంపిక చేసుకుని వారి రుణాలను అమితాబ్‌ బ్యాంకులకు ఏక మొత్తంగా ఒకేసారి చెల్లించారు. కూతురు స్వేతా బచ్చన్‌, కొడుకు అబిషేక్‌ బచ్చన్‌ చేతుల మీదుగా బాధిత రైతులకు అమితాబ్‌ సాయం చేశారు. మరో వాగ్దానం నెరవేర్చాల్సి ఉంది. దేశం కోసం పుల్వామా దాడిలో మృతిచెందిన అమరవీరుల కుటుంబ సభ్యులను, వారి భార్యలను ఆదుకోవాల్సి ఉందన్నారు. ఈ సాయం కూడా త్వరలోనే తీరుస్తామని తెలిపారు బిగ్ బీ.అమితాబ్ చేసిన ఈ పనికి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.

సంబంధిత సమాచారం :

More