యూట్యూబ్ లో థమన్ రేర్ ఫీట్ ..!

Published on Dec 10, 2019 1:01 pm IST

టాలీవుడ్ కి చెందిన టాప్ హీరోల సాంగ్స్, టీజర్స్ యూ ట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతూ ఆశ్చర్య పరుస్తున్నాయి. సాధారణంగా టీవీ రియాలిటీ షోలు, ఇతర కార్యక్రమాలు ట్రెండింగ్ లో కొనసాగుతూ ఉంటాయి. దీనికి భిన్నంగా టాప్ ఫైవ్ యూట్యూబ్ వీడియోస్ టాలీవుడ్ కి చెందిన హీరోలవి కావడం గమనార్హం. నిన్న విడుదలైన మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ సాంగ్ ‘సూర్యుడివో… చంద్రుడివో..’ వీడియో యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో ఉండగా…,ఆతరువాత అలవైకుంఠపురంలో టీజర్ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో కొనసాగుతుంది. ఇక మూడవ స్థానంలో వెంకీ మామ ట్రైలర్, నాలుగవ స్థానంలో డిస్కో రాజా టీజర్ చివరిగా ఐదో స్థానంలో రూలర్ ట్రైలర్ ట్రెండ్ అవుతున్నాయి.

మరో విశేషం ఏమిటంటే ఈ ఐదు ట్రెండింగ్ వీడియోస్ లో మూడు చిత్రాలకు థమన్ సంగీతం అందించడం. బన్నీ నటించిన అలవైకుంఠపురంలో అలాగే రవితేజ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ డిస్కో రాజా, అలాగే వెంకటేష్ మరియు నాగ చైతన్యల మల్టీ స్టారర్ వెంకీ మామ చిత్రాలకు థమన్ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం థమన్ తన ఫార్మ్ కొనసాగిస్తున్నాడు. వచ్చే ఏడాది బాలయ్య బోయపాటి సినిమా మరియు నాని నటిస్తున్న టక్ జగదీశ్, రవితేజ క్రాక్ చిత్రాలకు కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక కబడ్డాడు.

సంబంధిత సమాచారం :

X
More