కియారా క్లారిటీ..తారక్ తోనా చరణ్ తోనా.?

Published on Jun 13, 2021 1:40 pm IST

పాన్ ఇండియన్ లెవెల్ స్పాన్ ఉన్న అతి కొద్ది మంది స్టార్ హీరోయిన్స్ లో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కూడా ఒకరు. అయితే మన తెలుగు మొట్ట మొదట మహేష్ తో పరిచయం అయిన ఈ హాట్ బ్యూటీ లాస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో “వినయ విధేయ రామ” చేసింది.

మళ్ళీ అక్కడ నుంచే అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. మరి వాటిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల ప్రాజెక్ట్ లో ఫిక్స్ అయ్యిందన్న టాక్ తో పాటుగా భారీ పాన్ ఇండియన్ సినిమా చరణ్ మరియు శంకర్ ల కాంబోకి కూడా తన పేరు ఫ్రంట్ లైన్ లో ఉన్నట్టుగా తెలిసింది.

మరి ఇప్పుడు ఎట్టకేలకు కియారా క్లారిటీ ఇచ్చింది. సౌత్ ఇండియన్ సినిమాకి త్వరలోనే వస్తున్నాని అందులో భాగంగానే ఒక ఎగ్జైటింగ్ అనౌన్సమెంట్ కూడా వస్తుందని తెలిపింది. మరి ఈ అనౌన్సమెంట్ ఏ స్టార్ హీరో సినిమా నుంచి అనౌన్సమెంట్ అన్నది ఆసక్తిగా మారింది. అది ఎన్టీఆర్ తో సినిమానా లేక చరణ్ తో సినిమానా అన్నది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :