చరణ్ నుంచి ఏదో గట్టి అప్డేట్ నే వచ్చేలా ఉందే.!

Published on Sep 17, 2021 9:04 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన భారీ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఇటీవల చరణ్ ఓ యాడ్ నిమిత్తం సన్నద్ధం అయ్యిన అంశం కూడా సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. అయితే మొత్తానికి తన సినిమాల నుంచో లేక యాడ్ కి సంబంధించో కానీ చరణ్ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ ఆసక్తిగా మారింది.

ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ అందులో స్మోక్ దానిలో తాను కనిపించీ కనిపించనట్టుగా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నాడు. అలాగే దాన్ని షూట్ చేస్తున్న కెమెరా ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా చరణ్ డ్రెసింగ్ చాలా స్టైలిష్ గా ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. మరి దీనితో మీ స్క్రీన్స్ మీదకి ఒక సరికొత్త ఎంటర్టైనింగ్ ప్రపంచాన్ని తీసుకురావడానికి అంతా సిద్ధంగా ఉంది ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ ఉందని తెలిపాడు. మరి ఈ అప్డేట్ ఏంటో అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :