పూరి,వర్మల గురుశిష్యుల బంధం ఇంత ఘాటైనదా!

Published on Jul 20, 2019 11:52 am IST

దర్శకుడు పూరి “ఇస్మార్ట్ శంకర్” తో అందిన విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. పూరి కి చాలా కాలం తరువాత వచ్చిన విజయం కావడంతో ఈ విజయాన్నిసన్నిహితులతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. 2015లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన “టెంపర్” చిత్రం తరువాత ఆయన హిట్ కొట్టలేదు. మళ్ళీ నాలుగేళ్ల తరువాత “ఇస్మార్ట్ శంకర్” ఆయనకు విజయం అందించింది.

కాగా “ఇస్మార్ట్ శంకర్” లో పోలీస్ అధికారిగా చేసిన నటుడు సత్యదేవ్ తన ట్విట్టర్ లో ఓ ఆసక్తికర ఫోటో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో డైరెక్టర్ పూరీని, రాంగోపాల్ వర్మ గట్టిగా ముద్దు పెడుతున్నారు. ఆ ఫోటో చూసిన కొందరు పూరి,రామ్ మధ్య ఇంత ఘాటైన గురుశిష్యుల బంధం ఉందా అని ఆశ్చర్య పోతున్నారు. పరిశ్రమకి వచ్చిన కొత్తలో పూరి, వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అప్పటి నుండి వీరి మధ్య అనుబంధం ఉంది. ఆ ఫోటోలో మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కూడా ఉండటం మరో విశేషం.

సంబంధిత సమాచారం :

X
More