యూఎస్‌లో పొలిశెట్టి జోరు.. అనగనగా ఒక రాజు లేటెస్ట్ కలెక్షన్స్ ఇవే..!

యూఎస్‌లో పొలిశెట్టి జోరు.. అనగనగా ఒక రాజు లేటెస్ట్ కలెక్షన్స్ ఇవే..!

Published on Jan 21, 2026 3:03 PM IST

Anaganaga Oka Raju

ట్యాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన లేటెస్ట్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు మారి తెరకెక్కించగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించింది. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ వరకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.

అటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ చిత్రం తన జోరు చూపిస్తోంది. ఇప్పటికే మిలియన్ డాలర్ క్లబ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం వసూళ్ల పరంగా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు కామెడీ జోనర్ ప్రేమికులను ఈ చిత్రం థియేటర్లకు రప్పిస్తోంది. దీంతో ఈ చిత్ర కలెక్షన్స్ స్టడీగా దూసుకుపోతున్నాయి. ఈ సినిమా యూఎస్‌లో ప్రస్తుతం 1.6 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఇక ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ చిత్ర వసూళ్లు మరింత పెరగడం ఖాయమని చిత్ర వర్గాలు ఆశిస్తున్నాయి.

AOR 3

తాజా వార్తలు