టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు మారి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర నవ్వులు పూయించేందుకు నవీన్ రెడీ అవుతున్నాడు.
ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన రన్ టైమ్‌ను మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 2 గంటల 20 నిమిషాల రన్‌టైమ్‌ను మేకర్స్ లాక్ చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రానికి ఇది పర్ఫెక్ట్ రన్‌టైమ్ అని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ప్రేక్షకులు ఈ రన్‌టైమ్‌తో సినిమా అప్పుడే ముగిసిందా అని ఫీల్ కావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ చిత్రం జనవరి 14న గ్రాండ్ రిలీజ్ కానుంది.


