‘అనగనగా ఓ ప్రేమకథ’ ఓ మంచి ప్రేమ‌క‌థ‌ అంట !

‘అనగనగా ఓ ప్రేమకథ’ ఓ మంచి ప్రేమ‌క‌థ‌ అంట !

Published on Dec 12, 2018 4:54 PM IST

ప్రతాప్‌ తాతం శెట్టి దర్శకత్వంలో థౌజెండ్‌ లైట్స్‌ మీడియా ప్రై.లి బ్యానర్‌ పై కె.ఎల్‌.రాజు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. విరాజ్‌ జె.అశ్విన్‌, రిద్దికుమార్‌, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం డిసెంబర్‌ 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో… నిర్మాత కె.ఎల్‌.ఎన్ రాజు మాట్లాడుతూ – “మంచి న‌టీన‌టులతో, సాంకేతిక నిపుణుల స‌హకారంతో మంచి ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కించాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఓ కూతురుని మంచి దారిలో పెట్ట‌డానికి తండ్రి ఏం చేశాడ‌నేదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్‌. డిసెంబ‌ర్ 14న సినిమాను గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ స‌హ‌కారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ తాతం శెట్టి మాట్లాడుతూ – “మంచి క్యూట్ ల‌వ్ స్టోరీ. అహ్లాద‌క‌రంగా ఉంటుంది. కె.ఎల్‌.ఎన్‌.రాజుగారి స‌హాయంతో సినిమాను పూర్తి చేశాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. డిసెంబ‌ర్ 14న విడుద‌లవుతోన్న మా ప్ర‌య‌త్నాన్ని ఆదరిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు