‘ఆగడు’ వివాదంపై క్లారిటీ ఇచ్చిన ఆనంద్ రవి

Published on Jun 8, 2014 4:36 pm IST

Ananad-Ravi-
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ సినిమా టీజర్ కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో అలాగే పలు విషయాల్లో వివాదాల్లో కూడా ఇరుక్కుంది. తాజాగా తలెత్తిన వివాదం రైటర్ ఆనంద్ రవి గురించి.. అసలు విషయలోకి వెళితే ఆగడు సినిమాకి డైలాగ్ రాసిన ఆనంద్ రవికి శ్రీనువైట్ల క్రెడిట్ ఇవ్వడం లేదని వార్తలు వచ్చాయి.

ఇవన్నీ వట్టి పుకార్లే అని ఆనంద్ రవి కొట్టి పారేసాడు. ఈ విషయంపై తన ఫేస్ బుక్ లో స్పందిస్తూ ‘హాయ్ ఫ్రెండ్స్ గత కొద్ది రోజులుగా ఆగడు సినిమాకి నేను పనిచేశానని దానికి నాకు భారీ అమౌంట్ ఇచ్చారని, ముందుగా అనుకున్నట్టు కాకుండా టైటిల్స్ లో నా పేరు వెయ్యాలని డిమాండ్ చేస్తున్నానని వస్తున్నా వార్తల్లో నిజం లేదు. నాకు శ్రీనువైట్ల గారి వర్క్ అంటే ఇష్టం. నాకు ఈ ప్రాజెక్ట్ కి అసలు ఎలాంటి సంబందం లేదు. అలాగే శ్రీను వైట్ల గారిని ఇప్పటి వరకూ కలవలేదు. ఇక ఇలాంటి పుకార్లు ఆపేయండని’ పోస్ట్ చేసాడు.

సంబంధిత సమాచారం :