రేస్ క్లబ్ సిరీస్ లో ‘ఆనంద్ దేవరకొండ’ ?

Published on Oct 26, 2020 8:03 pm IST

టాలీవుడ్ క్రేజీ స్టార్ ‘విజయ్ దేవరకొండ’ తన యాక్టింగ్ కంటే కూడా తన ఆటిట్యూడ్ తోనే ఎక్కువ అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఈ సెన్సేషనల్ స్టార్ తమ్ముడిగా ‘దొరసాని’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ‘ఆనంద్ దేవరకొండ’. కానీ తన అన్నయ్యలాగే స్టార్ అవుతాడు అనుకుంటే హీరోగా మొదటి సినిమాతో హిట్ కొట్టలేకపోయాడు. అయితే ‘ఆనంద్ దేవరకొండ’ కోసం ఒక వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో ఉన్నాడట విజయ్.

కాగా ఈ వెబ్ సిరీస్ నేపథ్యం మొత్తం కొత్తగా ఉండబోతుందని.. ఆనంద్ దేవరకొండ పాత్ర మొత్తం హార్స్ రేసింగ్ నెపథ్యంలో సాగుతుందని.. అలాగే ఈ సిరీస్ చాలా వరకు రేస్ క్లబ్ లోనే చిత్రీకరిస్తారని తెలుస్తోంది. తన తమ్ముడి కోసం ఈ సిరీస్ ను నిర్మించబోతున్న విజయ్ ఇప్పటికే నిర్మాతగా ఒక సినిమా తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలోకి కూడా అడుగుపెట్టబోతున్నాడు. ఇక ఆనంద్ దేవరకొండ ఈ వెబ్ సిరీస్ కోసం చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడట.

సంబంధిత సమాచారం :

More