ఇంటర్వ్యూ : ఆనంద్ దేవ‌ర‌కొండ‌ – నిజ‌జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉండే ప్రేమ‌క‌థ‌ ఇది !

ఇంటర్వ్యూ : ఆనంద్ దేవ‌ర‌కొండ‌ – నిజ‌జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉండే ప్రేమ‌క‌థ‌ ఇది !

Published on Jul 9, 2019 5:18 PM IST

కె.వి.ఆర్ మ‌హేంద్ర దర్శకత్వంలో శివాత్మిక రాజ‌శేఖ‌ర్ ఆనంద్ దేవ‌ర‌కొండ‌ హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మ‌ధురా ఎంట‌ర్ టైన్మెంట్, బిగ్ బెన్ సిన‌మాలు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘దొర‌సాని’. కాగా ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ అవుతోన్న సంద‌ర్భంగా హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఆనంద్ దేవ‌ర‌కొండ వెల్లడించిన ఆసక్తికర విశేషాలు మీ కోసం.

 

దొర‌సాని సినిమా గురించి చెప్పండి ?

 

నిజ‌జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉండే ప్రేమ‌క‌థ‌ ఇది. డైరెక్టర్ మ‌హేంద్రగారు సినిమాలో ఎక్క‌డా ఫేక్ ఎమోష‌న్స్ పెట్టలేదు. చాలా రియ‌లిస్టిక్ గా ఆయన సినిమాను మలిచారు. పైగా అన్నీ రియ‌ల్ లోకేష‌న్స్ లోనే ఈ సినిమా షూటింగ్ చేసాము. ఇది పిరియాడిక్ ల‌వ్ స్టోరీ. క‌థ‌ క‌థ‌లోని స్వ‌చ్ఛ‌త‌, నిజాయితీ ఈ ప్రేమ‌క‌థ‌ను ముందుకు న‌డిపిస్తాయి.

 

ఈ సినిమాలో హీరోగా అవకాశం ఎలా వచ్చింది ?

విజ‌య్ దేవ‌రకొండ త‌మ్ముడిగానే ఈ సినిమాకి అవకాశం వచ్చింది. మొదట ఈ క‌థ కోసం ఆర్టిస్ట్ ల‌ను వెతుకుతున్న క్రమంలో న‌న్ను ట్రై చేద్దాం అనుకున్నారు. నేను, శివాత్మిక ఆడిష‌న్స్ చేసాము. ఆ క్యారెక్ట‌ర్స్ లో మేము కరెక్ట్ గా సరిపోతామని న‌మ్మ‌కంతోనే మమ్మల్ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు.

 

దొరసాని కాకుండా ఇంకా ఎన్ని ఆఫ‌ర్స్ వచ్చాయి ?

 

అన్న‌య్యకి అర్జున్ రెడ్డి రూపంలో బ్లాక్ బ్లస్టర్ వచ్చాక.. అన్నయ్య డేట్లు కోసం చాలమంది దర్శకనిర్మాతలు అడిగేవారు. అప్పుడు అన్నయ్య డేట్లు ఎడ్జెస్ట్ కాక, సరే కనీసం నా డేట్లు అన్న ఇవ్వమన్నారు. అలా కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కానీ నేను ఆ ఆఫర్స్ ని ఎప్పుడూ సీరియ‌స్ గా తీసుకొలేదు. అప్పుడు యూఎస్ లో ఉండేవాడ్ని. కానీ ఇంతలో అన్న‌య్య బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్ ని స‌పోర్ట్ చేద్దామ‌ని నేను ఇండియాకి వ‌చ్చాయి. ఆ టైంలో మ‌హేంద్రగార్ని క‌లిశాక సినిమా చేయాలనే ఆసక్తి ఏర్పడింది. అలా సినిమా చేయడం జరిగింది.

 

మీ సినిమా పై విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఎలా ఫీల్ అయ్యారు ?

 

అన్నయ్య తన సినిమాకి పడనంత టెన్షన్ నా సినిమాకి పడ్డాడు. సినిమా చూడటానికి వెళ్తునప్పుడే ఎలా ఉంటుందో నేను ఎలా చేశానో అని చాలా టెన్ష‌న్ ప‌డ్డాడు. ఆ తర్వాత సినిమా చూసి.. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.

 

సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

 

సినిమాలో రాజు అనే పాత్రలో కనిపిస్తాను. రాజు పాత్ర చాలా రియ‌లిస్టిక్ గా ఉంటుంది. రాజు సన్నివేశాలు కూడా చాలా స‌హాజంగా అనిపిస్తాయి. నా పాత్రతో పాటు మిగిలిన పాత్ర‌లు కూడా రియ‌ల్ లైఫ్ కి చాల దగ్గరిగా ఉంటాయి. ప్రేక్ష‌కులు ఈజీగా క‌నెక్ట్ అవుతార‌నే నమ్మకం ఉంది.

 

శివాత్మిక గురించి ?

 

దేవ‌కి పాత్ర‌లో శివాత్మిక అద్భుతంగా నటించింది. ఆ పాత్రకు తగట్లు ఆమె నటన చాల సహజంగా అనిపిస్తోంది.

 

మీ పై వ‌చ్చే కామెంట్స్ ని ఎలా తీసుకుంటారు ?

 

సోష‌ల్ మీడియాలో చాలమంది చాల రకాలుగా కామెంట్స్ చేస్తారు. అయితే ఆ కామెంట్స్ ను నేను సీరియ‌స్ గా తీసుకోను. కానీ సినిమా విడుదల అయ్యాక నా యాక్టింగ్ కి సంబధించి వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను మాత్రం దృష్టిలో పెట్టుకుని నటన పై మరింతగా కేర్ తీసుకుంటాను.

 

మీ తదుపరి సినిమాలు ?

 

ఇప్పటికైతే తరువాత సినిమాలు ఆలోచించలేదు. అయితే రెండు కథలు విన్నాను, బాగున్నాయి. ప్రస్తుతానికైతే దొరసాని రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు