క్రేజీ హీరోయిన్‌ ఇంట విషాదం !

Published on Jul 11, 2021 7:30 pm IST

క్రేజీ హీరోయిన్‌ అనన్య పాండే నాయనమ్మ స్నేహలత(85) పాండే నిన్న తుది శ్వాస విడిచారు. చిన్నప్పటి నుండి అనన్యకు వాళ్ళ నాయనమ్మతో మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు ఆమెనే అంటిపెట్టుకుని ఉంటుంది. అలాంటి ఆమె ఒక్కసారిగా దూరం అయిపోవడంతో అనన్య ఆ వార్తను అసలు జీర్ణించుకోలేకపోతుంది. తాజాగా తన సోషల్‌ మీడియా ఎకౌంట్ లో తన నాయనమ్మకు కన్నీటి నివాళులు అర్పించింది అనన్య.

ఈ సందర్భంగా అనన్య మెసేజ్ చేస్తూ.. ‘రెస్ట్‌ ఇన్‌ పవర్‌ మై ఏంజెల్‌. మా నాయనమ్మకు పుట్టుకతోనే గుండెలోని ఒక కవాటం సరిగా లేదని.. ఆమె ఎక్కువ కాలం బతకలేదని అప్పట్లో డాక్టర్లు తేల్చి చెప్పారట. కానీ 85 ఏళ్ల వయసులోనూ మా నాయనమ్మ అలుపెరగకుండా పని చేస్తూ.. ప్దొదున్నే ఏడు గంటలకల్లా రెడీ అయి ఉండటాన్నిచూసి నేను ఎప్పుడు ఆశ్చర్యపోయేదాన్ని. ఈ రోజు ఆమె నాతో లేదు. కానీ, ఆమె చేతిలో పెరిగి ఇంతటిదాన్ని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది” అంటూ అనన్య పాండే రాసుకొచ్చింది.

సంబంధిత సమాచారం :