అనసూయకు మరో క్రేజీ ఆఫర్

అనసూయకు మరో క్రేజీ ఆఫర్

Published on Nov 25, 2019 5:10 PM IST

anasuya

బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ అనసూయ ‘రంగస్థలం’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ఆమెకు చాలానే ఆఫర్లు వచ్చినా ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటోంది. ప్రధానంగా లేడీ ఒరియెంటెడ్ కథల్ని, ప్రత్యేకత, కథలో ప్రాధాన్యం కలిగిన పాత్రల్ని చూజ్ చేసుకుంటున్న అమె తాజాగా కృష్ణవంశీ సినిమా ‘రంగమార్తాండ’లో ఆఫర్ పొందినట్టు తెలుస్తోంది.

తన ఫేవరెట్ దర్శకుడు కృష్ణవంశీ నుండి ఆఫర్ అందుకున్న అనసూయ ఆయన చెప్పిన పాత్ర కథలో కీలకంగా ఉండటంతో వెంటనే ఓకే చెప్పేసిందట. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కు ఇది రీమేక్. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనున్నారు. మధు కలిపు, అభిషేక్ జవ్కర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు