తన నెక్స్ట్ ఐకానిక్ రోల్ పై అనసూయ సాలిడ్ స్టేట్మెంట్

తన నెక్స్ట్ ఐకానిక్ రోల్ పై అనసూయ సాలిడ్ స్టేట్మెంట్

Published on Apr 19, 2025 9:00 PM IST

మన టాలీవుడ్ సినిమా దగ్గర బుల్లితెర దగ్గర నుంచి వెండితెరపై మంచి ఆదరణ అందుకున్న యాంకర్స్ లో గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. మరి జబర్దస్త్ నుంచి వచ్చిన మంచి ఫేమ్ తో వరుస ఆఫర్స్ ని తాను అందుకుంది. మరి తన కెరీర్లో పలు ఐకానిక్ పాత్రలు అంటే మొదటగా వినిపించేది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర గుర్తొస్తుంది.

ఇక దీని తర్వాత ఐకాన్ స్టార్ పుష్ప సినిమాలో ద్రాక్షాయని పాత్ర కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే అనసూయ లేటెస్ట్ గా సాలిడ్ స్టేట్మెంట్ ని ఆమె అందించింది. తన నుంచి నెక్స్ట్ వచ్చే ఓ పాత్ర మాత్రం ఆ రెండు సినిమాలుకి మించి ఉంటుంది అని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతుంది. మరి ఆ చిత్రం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. మరి ఆ సినిమా ఏంటో చూడాలి. ఇక రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు