ఎయిర్ హోస్టెస్‌గా కనిపించబోతున్న అనసూయ..!

Published on Jul 31, 2021 2:00 am IST

బుల్లి తెరపైనే కాకుండా వెండి తెరపై కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న అనసూయ అందుకు తగ్గట్టుగానే విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తుంది. క్షణం, రంగస్థలం, థ్యాంక్యూ బ్రదర్ వంటి సినిమాల్లో ఆమె ఎంచుకున్న పాత్రలు మంచి పేరును తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ మరో డిఫరెంట్ జానర్ సినిమాకు ఒకే చెప్పినట్టు తెలుస్తుంది.

అయితే పేపర్ బాయ్, విటమిన్-షి సినిమాలతో ఆకట్టుకున్న జయశంకర్ దర్శకత్వంలో వస్తున్న ఓ కొత్త సినిమాలో అనసూయ ఎయిర్ హోస్టెస్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదో ఆంథాలజీ మూవీ అని, ఇందుల 6 కథల సమ్మేళనం ఉంటుందని, ప్రతి కథలో ఒక లీడ్ ఉంటారని, ఇలా అనసూయ కూడా ఓ కథకు లీడ్ రోల్ పోషిస్తుందని సమాచారం. అయితే వచ్చే నెల నుంచి అనసూయ ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప సినిమాలో అనసూయ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :