అక్కడ ముమైత్, ఇక్కడ మోనాల్.. ఓంకార్ ఏమన్నాడంటే?

Published on Aug 11, 2021 12:52 am IST

సిక్స్త్ సెన్స్ సీజన్ 4 ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఓంకార్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో ఈ వారాంతం డబుల్ ఎంటర్‌టైన్మెంట్ పక్కా అనేలా ఉంది. మోనాల్, ముమైత్, ప్రభాకర్ ఫ్యామిలీ, అమ్మ రాజేశేఖర్ ఫ్యామిలీలు ఈ వారం సందడి చేసేందుకు రాబోతున్నారు. తాజాగా దీనికి సంబందించిన ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది.

అయితే ప్రోమోలో ముమైత్ ఓంకార్‌ని కాల్చేందుకు గన్‌తో గుండెలపై గురిపెడుతుంది. అప్పుడు ఓంకారక్కడ నువ్వున్నావు అని చెప్పగా గన్ ఇటువైపుకు తిప్పుతుంది. ఇక్కడ మోనాల్ ఉంది అని ఓంకార్ చెప్పగా మధ్యలో కాలుస్తానని ముమైత్ అంటుంది. మరీ ఈ డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎపిసోడ్‌ను మిస్ కాకూడదంటే ఈ శని మరియు ఆదివారం రాత్రి 9 గంటలకు స్టార్ మా లో వచ్చే సిక్స్త్ సెన్స్ ను చూడాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :