ఓంకార్ పొగడ్తలకు ఉబ్బితబ్బిబిపోయిన ఇంద్రజ..!

Published on Aug 7, 2021 2:00 am IST


స్టార్ మాలో ప్రముఖ యాంకర్ ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్ 4 బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ వారాంతం ఈ షోకు సుడిగాలి సుధీర్, ఇంద్రజ వచ్చారు. తాజాగా దీనికి సంబందించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది.

అయితే ఇంద్రజపై ఓంకార్ చెప్పిన డైలాగ్‌కి ఇంద్రజ ఉబ్బితబ్బిబయ్యింది. ఇంద్రలోకంలో ఇంద్రజ ఎలా ఉంటారో నాకు తెలీదు కానీ మిమ్మల్ని చూశాక ఫిక్స్ అయ్యాను పైనుండే ఇంద్రజ మీలానే ఉంటుందని ఓంకార్ చెప్పిన డైలాగ్ అద్భుతంగా అనిపించింది. ఇక సుడిగాలి సుధీర్ తనదైన స్టెయిల్‌లో స్టెప్పులు వేసి అలరించాడు. మరీ ఈ సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎపిసోడ్‌ను మిస్ కాకూడదంటే ఈ శని మరియు ఆదివారం రాత్రి 9 గంటలకు స్టార్ మా లో వచ్చే సిక్స్త్ సెన్స్ ను చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :