అప్పటిలోపు పెళ్లి చేసుకుంటా.. శ్రీముఖి క్లారిటీ..!

Published on Aug 17, 2021 1:00 am IST

బుల్లితెర ప్రముఖ యాంకర్ శ్రీముఖి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. మనో, భరణి, రాజా రవీంద్ర కీలక పాత్ర‌ల్లో నటిస్తున్న రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ “క్రేజీ అంకుల్స్’ సినిమాలో శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించింది. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్, గ్రీన్ మెట్రో మూవీస్‌, శ్రీవాస్ 2 క్రియేటీవ్స్ బ్యానర్స్‌పై గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 19న రిలీజ్ కాబోతుంది.

ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీముఖి తన పెళ్లిపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను పెళ్లి చేసుకోవడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, నాకు నచ్చే వ్యక్తి దొరకడానికి సమయం పడుతుందని, ఏదైనా మన అదృష్టాన్ని బట్టి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం తనకు 28 సంవత్సరాలు మాత్రమే అని, 31 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకుంటానని శ్రీముఖి చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :