క్రిస్టియానో రోనాల్డో వీడియో తో “వర్షిణి” ఫన్

Published on Jul 14, 2021 8:07 pm IST

బుల్లితెర పై తన మెస్మరైజింగ్ యాంకరింగ్ తో, తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్న వర్షిణి తాజాగా ఇన్స్టాగ్రం లో ఒక వీడియో ను పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ అయిన క్రిస్టియానో రోనాల్డో ఇటీవల కూల్ డ్రింక్స్ ను పక్కన పెడుతూ ఉన్నటువంటి వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. వాటర్ కి ప్రాముఖ్యత ఇవ్వాలని, కూల్ డ్రింక్ వొద్దు అన్నట్లు గా ఒక సందేశం ఇచ్చారు అంటూ ఆయన అభిమానులు చెప్పుకొచ్చారు.

అయితే ఈ వీడియో పై యాంకర్ వర్షిణి ఫన్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ బాటిల్స్ ను టీవీ నుండి డైరెక్ట్ గా తీసుకుంటున్నట్లు చేస్తూ ఫన్ క్రియేట్ చేసింది. యాంకర్ వర్షిణి చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో మీరు ఒకసారి లుక్కేయండి.

సంబంధిత సమాచారం :