“శాకుంతలం”లో ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర యాంకర్..!

Published on Jul 26, 2021 11:00 pm IST

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం “శాకుంతలం”. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల-దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా వాయిదాపడిన ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల నుంచి శరవేగంగా జరుగుతుంది.

అయితే ఈ మూవీకి సంబందించిన ఓ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే బుల్లి తెర యాంకర్ వర్షిణి సౌంద‌రాజ‌న్ ఇందులో కీ రోల్‌లో క‌నిపించ‌నుంద‌న్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ మధ్యనే వర్షిణి ఈ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్టు టాలీవుడ్ వ‌ర్గాల టాక్‌. ఈ సినిమాలో తనకు మంచి పాత్ర దొరికిందని, సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఎక్సయిట్‌గా ఫీలవుతున్నట్టు స్వయంగా వర్షిణే చెప్పుకొచ్చింది. ఈ సినిమా తనకు మంచి గుర్తింపు తెచ్చి పెడుతుందని భావిస్తున్నట్టు ఆమె తెలిపింది.

సంబంధిత సమాచారం :