అలీ సినిమా టైటిల్ ట్రాక్‌ని రిలీజ్ చేసిన సోనూసూద్..!

Published on Jul 10, 2021 12:08 am IST


సీనియర్ కమెడీయన్ ఆలీ, నరేశ్‌ ప్రధాన పాత్రల్లో మలయాళంలో విజయవంతమైన ‘వికృతి’కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’. శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆలీబాబా, కొణతాల మోహన్‌, శ్రీచరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్‌ ట్రాక్‌ రిలీజ్ అయ్యింది.

రియల్ హీరో సోనూసూద్ చేతుల మీదుగా టైటిల్ ట్రాక్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సోనూసూద్‌ మాట్లాడుతూ అలీకి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన ఈ గీతానికి రాకేశ్‌ స్వరాలు సమకూర్చగా, అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఈ సినిమాలో శివ బాలాజీ, పవిత్ర లోకేశ్‌, మౌర్యానీ, సనా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబంధిత సమాచారం :