బాలీవుడ్ హిందీ రిమేక్ లాంచ్ చేసిన నితిన్..!

Published on Feb 24, 2020 12:35 pm IST

భీష్మ హిట్ తో నితిన్ ఫుల్ ఫార్మ్ లోకి వచ్చారు. ఇప్పటికే మూడు సినిమాలు ఆయన చేస్తుండగా నేడు మరో చిత్రం ప్రారంభించారు. హిందీలో నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీగా ఉన్న అంధాదున్ తెలుగు రీమేక్ లో నితిన్ నటిస్తున్నారు. దీనిపై గతంలోనే వార్తలు రాగా నేడు అధికారికంగా ప్రారంభం అయ్యింది.

ఈ చిత్రానికి దర్శకుడిగా మేర్లపాక గాంధీ వ్యవహరిస్తూ ఉండగా సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులు శ్యాంప్రసాద్ రెడ్డి, దర్శకుడు సురేందర్ రెడ్డి మరియు దిల్ రాజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ చిత్రంలోని నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది. ఈ చిత్ర షూటింగ్ జూన్ నుండి మొదలుకానుంది.ఈ చిత్రంలో నితిన్ గుడ్డివాడిగా కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More