‘కేరింత’ ఫెమ్ పార్వతీశం , కిరాక్ పార్టీ హీరోయిన్ సిమ్రాన్ జంటగా ‘అందాలరాముడు’ ఫేం లక్ష్మి నారాయణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నువ్వక్కడ నేనిక్కడ’. కీర్తన మూవీ మేకర్స్ సమర్పణలో శ్రీ శ్రీనివాస విజువల్స్ బ్యానర్ ఫై గనిరెడ్డి, కీర్తన వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం ఉదయం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి పారస్ జైన్ క్లాప్ కొట్టగా, కె.కె.రాధామోహన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఆర్.బి.చౌదరి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు పి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ‘అందాల రాముడు’, ‘మంచివాడు’ సినిమాల తర్వాత నా దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేను మళ్లీ డైరెక్ట్ చేస్తున్న ఎంటర్టైనింగ్ మూవీ ఇది. యూత్ ఫుల్ సబ్జెక్ట్. నిర్మాత గని రెడ్డిగారు కూడా గతంలో కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో నాలుగు సినిమాలను నిర్మించారు. సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణను ప్లాన్ చేశాం. నేటి నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ లేదా జనవరిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, నాగబాబు, రఘుబాబు, చమ్మక్ చంద్ర మొదలుగు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.
