‘బుట్టబొమ్మ’ మూవీ మీ అందరినీ అలరిస్తున్నందకు సంతోషంగా ఉంది – అనికా సురేంద్రన్

Published on Feb 4, 2023 10:00 pm IST


బాలనటిగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా సినిమా బుట్టబొమ్మ. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు చేయగా శౌర చంద్రశేఖర్ రమేష్ దీనిని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరిచిన బుట్టబొమ్మ మూవీ నేడు ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఇక తమ సినిమాకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుండడంతో నేడు సక్సెస్ సంబరాలు జరుపుకున్నారు బుట్టబొమ్మ యూనిట్. ఈ సందర్భంగా నటి అనికా సురేంద్రన్ మాట్లాడుతూ, మలయాళ సూపర్ హిట్ మూవీ కప్పేలా కి రీమేక్ గా వచ్చిన మా బుట్టబొమ్మ మూవీ మీ అందరినీ ఎంతో అలరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇక ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేసిన నిర్మాత నాగవంశీ గారికి, సాయి సౌజన్య గారికి అలానే దర్శకుడు చంద్రశేఖర్ రమేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలానే ఈ మూవీలో తనతో కలిసి వర్క్ చేసిన సూర్య, అర్జున్ దాస్ ఇద్దరూ కూడా ఎంతో సపోర్ట్ చేసారని, ఇక ఆడియన్స్ చూపిస్తున్న ఆదరణకి వారికీ కూడా ఆమె ప్రత్యేకంగా థాంక్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం :