మహేష్ గారిని తప్పకుండా హ్యాపీ చేస్తాను : అనిల్ రావిపూడి

Published on May 19, 2019 3:17 pm IST

కష్టపడి చేసిన సినిమా హిట్టైతే ఎంత సంతోషంగా ఉంటుందో ప్రస్తుతం మహేష్ బాబుని చూస్తే తెలిసిపోతుంది. ‘మహర్షి’ సినిమా విజయాన్ని ప్రతి క్షణం ఆస్వాదిస్తున్నారు ఆయన. విజయోత్సవ ఈవెంట్లలో పాల్గొంటూ అభిమానులతో, ప్రేక్షకులతో ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈ విజయంతో వంశీ పైడిపల్లితో ఆయన బాండింగ్ మరింత బలపడింది. దీన్ని గమనించిన అనిల్ రావిపూడి తాను చేయబోయే సినిమా కూడా మహేష్ గారికి ఇదే స్థాయి సంతోషాన్ని ఇచ్చేలా ఉండాలని పనిచేస్తున్నారట.

నిన్న విజయవాడలో జరిగిన విజయోత్సవ సభలో పాల్గొన్న అనిల్ రావిపూడి వేదికపై మాట్లాడుతూ ‘మహర్షి తర్వాత సినిమా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని సన్నిహితులు, అభిమానులు చెబుతున్నారు. కానీ నా దృష్టిలో ఒక్కటే ఉంది. అదేమిటంటే మహేష్ బాబుగారి ఫేస్ మీద నవ్వు, సంతోషం. మంచి సినిమా తీస్తే ఆయనతో ఎంత సంతోషంగా ట్రావెల్ చేయవచ్చో ఈ సినిమా ద్వారా తెలిసింది. అదే నా టార్గెట్. ఎస్ఎస్ఎంబి26 సినిమాతో ఖచ్చితంగా ఆయన్ను హ్యాపీ చేస్తానని నమ్ముతున్నాను’అని అన్నారు.

సంబంధిత సమాచారం :

More