బాలయ్య కోసం రూటు మార్చిన అనిల్ రావిపూడి..!

Published on Aug 12, 2021 3:00 am IST

వరుస విజయాలతో దర్శకుడు దూసుకుపోతున్న టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలకృష్ణతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనిల్ రావిపూడి “ఎఫ్ 3” సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక బోయపాటితో చేస్తున్న “అఖండ” సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య దీని తర్వాత గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకొచ్చింది. ఈ మధ్య చాలా సినిమాలకు థమన్ మరియు దేవిశ్రీప్రసాద్‌లను మ్యూజిక్ డైరెక్టర్లుగా తీసుకుంటుంటే అనిల్ రావిపూడి మాత్రం బాలయ్య కోసం రూటు మార్చారు. అర్జున్ సురవరం, నోటా, మోసగాళ్లు వంటి సినిమాలకు మంచి పాటలను అందించిన శామ్ సీ ఎస్ ని ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకున్నట్టు తెలుస్తుంది. మరీ దీనిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

సంబంధిత సమాచారం :