ఇంటర్వ్యూ : దర్శకుడు అనిల్ రావిపూడి – చిరంజీవి-వెంకటేష్ కాంబో అదిరిపోతుంది!

ఇంటర్వ్యూ : దర్శకుడు అనిల్ రావిపూడి – చిరంజీవి-వెంకటేష్ కాంబో అదిరిపోతుంది!

Published on Jan 11, 2026 12:49 AM IST

anilravipudi

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి సందడికి సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

లాస్ట్ ఇయర్ రిలీజ్ టైం కి నెర్వస్ గా ఉంది అని చెప్పారు.. ఈ ఇయర్ ఎలా అనిపిస్తోంది?

ఈసారి కొద్దిగా రిలాక్స్ గా ఉన్నాను. నెర్వస్ పర్సంటేజ్ కొంచెం తగ్గింది. దానికి కారణం చిరంజీవి గారు. ప్రీరిలీజ్ ఈవెంట్లో హుక్ స్టెప్ సాంగ్ రిలీజ్ చేసాము. ఆ పాటకి చిరంజీవి గారు వేసిన డాన్స్, ఆ ఈవెంట్లో ఆయన ముందు నేను వెంకటేష్ గారు చేసిన అల్లరి ఇదంతా తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్ తీసుకొచ్చేసింది. దీంతో చాలా రిలాక్స్ అయ్యాను.

మ్యూజిక్ విషయంలో ఎక్కువగా లోకల్ టెక్నీషియన్ తో పని చేస్తుంటారు.. కారణం?

భీమ్స్ ఎక్కువగా కొత్త, లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తుంటాడు. సంక్రాంతికి వస్తున్నాంలో బ్లాక్ బస్టర్ పొంగల్ పాట పాడింది కూడా లోకల్ సింగర్స్. ఈ సినిమాలో మీసాల పిల్ల సాంగ్ కోసమే ఉదిత్ గారు, హుక్ స్టెప్ బాబాసాహెల్ గారు పాడారు.

చిరంజీవి గారికి వెంకటేష్ గారికి ఒక కథ చేయడం అంటే చాలా కసరత్తు ఉంటుంది కదా.. ఈ కథ జర్నీ గురించి చెప్పండి?

లక్కీగా నాకు మొదటి ఐడియానే హుక్ అవుతుంది. వెంకీ గారికి నాకు చాలా మంచి సింక్ ఉంటుంది. చిరంజీవి గారికి నేను చెప్పిన ఐడియా చాలా నచ్చింది. అలాగే క్యారెక్టరైజేషన్ కూడా చాలా నచ్చింది. ఈ మధ్యకాలంలో క్యారెక్టరైజేషన్ పాటు నడిచే కథ నేను చేయలేదు. ఒక కథని హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే తీసుకెళ్లడం అనేది నాకు కొత్తగా అనిపించింది.

నయనతార గారు ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా చేశారు కదా? ఎలా కుదిరింది?

నేను వర్క్ చేసే ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్స్ కి చాలా కంఫర్ట్ ఇస్తాను. మనం చాలా జెన్యూన్ గా ఒకటి అడుగుతున్నప్పుడు ఒక ఎమోషనల్ కనెక్షన్ అవతలి వాళ్ళకి జనరేట్ అయినప్పుడు కచ్చితంగా చెయ్యను అనుకున్న వాళ్లు కూడా చేస్తారు. నయనతార గారి విషయంలో కూడా అదే జరిగిందని అనుకుంటున్నాను. నయనతార చాలా హానెస్ట్. తనకు అనిపించింది చేస్తుంది తను బలంగా ఒకటి బిలీవ్ చేసినప్పుడు కచ్చితంగా చేస్తుంది.

ఇద్దరు బిగ్ స్టార్స్ ని ఎలా బ్యాలెన్స్ చేశారు?

బాలన్స్ అంటే మామూలుది కా.దు అది రేపు సినిమాలో చూస్తారు( నవ్వుతూ) చిరంజీవి గారు వెంకటేష్ గారు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. వారి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. దీంతో నాకు అంత కేక్ వాక్ అయింది. చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి చేసిన 18 రోజుల షూటింగ్ నా కెరియర్ లో వెరీ మెమొరబుల్.

చిరంజీవి గారు ఇందులో కొన్ని సన్నివేశాలని తొలగించేస్తారని చెప్పారు..ఎలాంటి సీన్స్ తొలగించారు?

ఇందులో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ బ్లాక్ ని కట్ చేశాము. అది కథకి కాస్త అడ్డుపడుతోంది. అందుకే కట్ చేయడం చేయాల్సి వచ్చింది.

చిరంజీవి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి పాటలు కి డాన్స్ చేస్తూ పెరిగాను.ఆయన్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు నా ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేను. ఒక్కసారిగా నా బాల్యంలోకి వెళ్ళిపోయాను. చిరంజీవి గారు వెంకటేష్ గారు అంటే నాకు చాలా గౌరవం. మా ముగ్గురు చాలా మంచి అనుబంధం ఉంది. చాలా పాజిటివ్ ఈ సినిమాని చేయడం జరిగింది. ఖచ్చితం చిరంజీవి గారు, వెంకటేష్ గారితో ఒక ఫుల్ లెంత్ సినిమా చేయడానికి ప్రయత్నిస్తాను.

మీరు చేయబోయే కొత్త సినిమా గురించి?

ఇంకా ఏది అనుకోలేదు. నేను సినిమా తర్వాత ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకున్నది లేదు. ఈ సినిమా తర్వాత ఒక రెండు వారాలు రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నాను.

తాజా వార్తలు