చిరు తర్వాత బాలయ్యకే అనిల్ ఓటు..?

Anil Ravipudi Balakrishna

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ కూడా ఒకటి. ఈ సినిమాను పూర్తి దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన మార్క్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే.

అయితే, మెగాస్టార్ చిరంజీవి మూవీ తర్వాత అనిల్ రావిపూడి తన నెక్స్ట్ చిత్రాన్ని ఎవరితో చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీని గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో చేయాలని ఫిక్స్ అయ్యాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘భగవంత్ కేసరి’ మూవీ వచ్చింది. ఇది బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అయ్యింది.

దీంతో అనిల్‌తో బాలయ్య మరో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట. ఈ క్రమంలోనే అనిల్ తో తన నెక్స్ట్ మూవీని చేసేందుకు బాలయ్య రెడీగా ఉన్నాడట. ఇక చిరు మూవీ తర్వాత బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమాను అనౌన్స్ చేస్తాడని.. దీనికి సంబంధించిన ప్రకటన ఈ కాంబోపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ కావడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

Exit mobile version