“ఎఫ్ 3” రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదట.!

“ఎఫ్ 3” రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదట.!

Published on Jul 31, 2021 12:10 PM IST

టాలీవుడ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రాలు రెండు ఉంటాయి. వాటిలో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన “సరిలేరు నీకెవ్వరు” కాగా మరొకటి వెంకీ మామ మరియు వరుణ్ తేజ్ ల కాంబోలో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “ఎఫ్ 2” అని చెప్పాలి. ఏడాది వ్యవధిల్లోనే వచ్చిన ఈ రెండు చిత్రాలు కూడా సంక్రాంతి రేస్ లో భారీ హిట్స్ గా నిలిచాయి.

అయితే ఈ “ఎఫ్ 2” కి సీక్వెల్ గా అదే తారాగణంతో తెరకెక్కిస్తున్న “ఎఫ్ 3” పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే వచ్చే మళ్ళీ ఏడాది సంక్రాంతి రేస్ లోనే ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేసారు. అయితే ఒక్కొక్కటిగా ఈ రేస్ లో బడా సినిమాలే నిలుస్తూ వచ్చాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి హీరోల సినిమాలు నిలవడంతో ఈసారి సంక్రాంతి పందెం ఇంకో లెవెల్లో ఉంటుంది అని అర్ధం అయ్యింది. అయితే ఈ రేస్ లో తమ సినిమా కూడా ఉందని వెంకీ మామ నిన్న జరిగిన “నారప్ప” సక్సెస్ మీట్ లో తెలిపారు. దీనితో సంక్రాంతి రేస్ లో ఈ చిత్రం కూడా కన్ఫర్మ్ అని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ చిత్రం అప్పుడు ఎలా పెర్ఫామెన్స్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు