టాలీవుడ్ హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో కలిసి ఓ క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించేందుకు అనిల్ రావిపూడి సిద్ధమవుతున్నాడు. అయితే, ఈ సినిమాలోకి ఓ స్టార్ టెక్నీషియన్‌ను ఆహ్వానిస్తూ అనిల్ రావిపూడి మరోసారి తనదైన వెరైటీ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేశాడు.
ప్రమోషన్స్‌ను వెరైటీగా చేయడంలో అనిల్ రావిపూడి దిట్ట. ఇక ‘వెంకీ-అనిల్5’ అనే ట్యాగ్‌తో తెరకెక్కనున్న ఈ కొత్త సినిమాకు సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డ్ విన్నర్ జి.వి.ప్రకాష్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించి తాజాగా ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. జంధ్యాల స్టై్ల్‌లో అనిల్ రావిపూడి ఈ వీడియోను తీర్చిదిద్దిన తీరు ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
జి.వి.ప్రకాష్ కూడా అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, లాస్ట్ లో లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ కూడా ఈ వీడియోలో కనిపించడంతో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. మొత్తానికి సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే, అనిల్ రావిపూడి తనదైన మార్క్‌తో కామెడీ పండిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.


