దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’ అనే ఆసక్తికరమైన చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి మద్దతుగా నిలుస్తూ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించాడు. ఐతే, నిజానికి ఈ సినిమాని ముందుగా అనిల్ రావిపూడి కూడా నిర్మించాలని అనుకున్నాడట. ఈ సినిమా సక్సెస్ మీట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ..”ఎనిమిదేళ్ల క్రితం సింగీతం గారు నాకు ఈ కథ చెప్పారు. నాకు తెలిసిన కొంతమంది నిర్మాతలకు ఈ కథ గురించి చెప్పాను. కానీ ఎవరూ ధైర్యం చేయలేదు’ అని ఆయన తెలిపారు.
అనిల్ రావిపూడి ఇంకా మాట్లాడుతూ.. ‘ఆ రోజుల్లో నా దగ్గర కూడా డబ్బుల్లేవు. కానీ, మనసులో ఈ కథ ఎప్పటికైనా స్క్రీన్ పైకి రావాలని గట్టిగా అనుకొన్నాను. ఇన్నాళ్లకు వచ్చింది. సినిమా సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.” అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఎక్కువ మంది కొత్త నటీనటులతో, లిమిటెడ్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


