‘ఎఫ్ 3’లో పిసినారిగా కామెడీ హీరో !

‘ఎఫ్ 3’లో పిసినారిగా కామెడీ హీరో !

Published on Jun 6, 2021 11:20 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ లతో కలిసి ‘ఎఫ్ 3’ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పిసినారి పాత్రలో కనిపించబోతున్నాడని, జంధ్యాల అహన పెళ్ళంట సినిమాలోని కోట పాత్రను కమటిన్యూ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో అనిల్ రావిపూడి ఈ పాత్రను రాశాడట. ఈ పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తోందట.

ఈ సినిమా తరువాత షెడ్యూల్ షూటింగ్ ను సారధి స్టూడియోలో స్టార్ట్ కానుంది. ఈ సినిమా డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా. అయితే ఈ సీక్వెల్ లో కూడా త‌మ‌న్నా, మెహ‌రీన్‌లే క‌థానాయిక‌లుగా న‌టించబోతున్నారు. వీళ్ళు వెంకీ వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. మొత్తానికి భార్యల టార్చరే ఎఫ్ 3 కథకు మెయిన్ మోటివ్ అని సమాచారం.

ఇక ఈ జనరేషన్ లో కామెడీని హ్యాండిల్ చేయడంలో బెస్ట్ ఎవరు అనగానే ముందుగా అనిల్ రావిపూడి పేరే ముందువరుసలో ఉంటుంది. అంతగా అనిల్ టాలీవుడ్ లో తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికే నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబులు నాలుగు నెలల్లో సినిమాని పూర్తి చేసి.. సంక్రాంతికు ఎఫ్ 3 రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు