టుడే ‘ఎఫ్ 3’ షూటింగ్ అప్ డేట్స్ !

Published on Jan 24, 2021 4:00 pm IST

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో ‘ఎఫ్ 3’ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రోజు హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో షూట్ చేస్తున్నారు. ఈ షూట్ లో వరుణ్ తేజ్, రాజేంద్రప్రసాద్, సునీల్, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి పై ఇంటర్వెల్ లో వచ్చే కామెడీ సీన్స్ ను తీస్తున్నారు. ఓ రోబరీలో ఇరుక్కుపోయి దాని నుండి బయటపడటానికి ఎన్ని కష్టాలు పడ్డారనేది కంటెంట్ అట. ఇక ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందని ఆ పాత్ర పూర్తీ కన్ ఫ్యూజన్ తో సాగుతూ ఫుల్ గా నవ్విస్తోందని.. ఆ పాత్రలోనే సునీల్ నటించబోతున్నాడని తెలుస్తోంది.

కాగా ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే, డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలియజేశారు. కాగా వెంకీ ఈ సినిమాతో పాటు ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు, వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు తర్వాత వరుణ్, వెంకీల నుండి రాబోతున్న సినిమా ‘ఎఫ్ 3’నే. అందుకే ఎఫ్ 3 కోసం వాళ్ళు ఫుల్ డేట్స్ కేటాయించారు.

సంబంధిత సమాచారం :