విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ సినిమాలోని ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్-లుక్ పోస్టర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ లుక్ ఒక పండుగ వాతావరణాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తోంది. పైగా కల్యాణ్ రామ్ ఉత్సాహభరితమైన డ్యాన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. క్రీమ్ రంగు కుర్తా, సాంప్రదాయ ధోవతి, పూలమాల మరియు స్టైలిష్ సన్ గ్లాసెస్ తో కళ్యాణ్ రామ్ తన లుక్ తో ఆకట్టుకున్నారు.
అన్నట్టు ఈ సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. ఇక నవంబర్ లోపు ఈ సినిమా షూట్ పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. అన్నట్టు ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాహు గారపాటి నిర్మాణంలో రానున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మూడు ట్యూన్స్ కూడా రెడీ చేశాడట. కాగా ఇక ఈ చిత్రానికి ‘జనవరి 13 విడుదల’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్. ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది.


