అఖిల్ “ఏజెంట్” ఫెయిల్యూర్ పై అనిల్ సుంకర పోస్ట్!

Agent 1

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్. ఈ మూవీ థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టలేక, డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ చిత్రం ఫెయిల్యూర్ పై ప్రొడ్యూసర్ అనిల్ సుంకర సోషల్ మీడియా వేదిక గా పోస్ట్ చేశారు.

ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ గా మారుతోంది. ఏజెంట్ రిజల్ట్ కి ఎవరిని బ్లేమ్ చేయకుండా, తమపై బాధ్యత వేసుకున్నారు. ఇది కష్టతరమైన పని అయినప్పటికీ, జయించాలి అని అనుకున్నాం. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయడం తో పాటుగా, కోవిడ్ ఇంకా సమస్యలు ఉన్నాయి అని అన్నారు. మేము ఎలాంటి సాకులు చెప్పకూడదు అని అనుకుంటున్నాం. ఈ తప్పుల నుండి ఎలాంటి మిస్టేక్స్ మరోసారి చేయకూడదు అని భావిస్తున్నాం. మాపై నమ్మకం ఉంచిన వారందరికీ మా క్షమాపణలు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ప్లానింగ్ తో పాటుగా, డెడికేటెడ్ గా వర్క్ చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారుతోంది.

Exit mobile version