ఇళయ దళపతి విజయ్ ఇపుడు తన చివరి సినిమాలో అలాగే ఇంకో పక్క రాజకీయాల్లో కూడా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన చివరి సినిమాగా దర్శకుడు హెచ్ వినోద్ తో జన నాయగన్ అనే సినిమా విజయ్ చేస్తుండగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి సెన్సేషనల్ సంగీతం దర్శకుడు అనిరుద్ సంగీతం అందిస్తుండగా తన మ్యూజిక్ పై ఓ క్రేజీ టాక్ వైరల్ గా మారింది.
రీసెంట్ గా వైరల్ అయ్యిన ప్రముఖ ఇండియన్ ర్యాప్ సింగర్ హనుమాన్ కైండ్ తో విజయ్ కోసం ఒక స్పెషల్ సాంగ్ ని అనిరుద్ ప్లాన్ చేసాడట. ఇది సినిమాలో అదిరిపోతుంది అని తెలుస్తుంది. దీనితో ఈ టాక్ విన్న విజయ్ అభిమానులు అలాగే మ్యూజిక్ లవర్స్ కూడా అనిరుద్ కాంబినేషన్ పై మంచి అంచనాలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ అవైటెడ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.


