సమంత సాంగ్ ని విడుదల చేసిన ‘యూ టర్న్’ చిత్రబృందం !

Uturn

సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘యూ టర్న్’. ఈ చిత్రంలో సమంత జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. సెప్టెంబర్ 13న తెలుగు తమిళ్ రెండు భాషల్లోనూ ఒకే సారి విడుదల అవ్వబోతున్న ఈ సినిమా నుండి ఒక ప్రమోషనల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది. కాగా ఈ ప్రమోషనల్ సాంగ్ ను అనిరుధ్ పాడుతుండగా.. సమంత డాన్స్ చేస్తున్న విజువల్స్ ప్లే చేశారు. అలాగే కొన్ని కీలకమైన సన్నివేశాలకు సంబంధించిన బిట్స్ ను కూడా చూపించారు.

పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రబృందం ఇప్పటికే ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది. కాగా సెప్టెంబర్ 13న నాగచైతన్య ‘శైలజా రెడ్డి అల్లుడు’ కూడా రిలీజ్ అవుతుంది. అంటే సమంతా తన భర్త చైతుతో పోటీ పడనుంది. మరి ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో చూడాలి.

సాంగ్ కోసం క్లిక్ చెయ్యండి

Exit mobile version