ఆసక్తి రేపుతున్న ‘ద‌ర్బార్‌’ మోషన్ పోస్టర్ !

ఆసక్తి రేపుతున్న ‘ద‌ర్బార్‌’ మోషన్ పోస్టర్ !

Published on Nov 7, 2019 6:38 PM IST

darbar

సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ద‌ర్బార్‌’. కాగా తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ మోషన్‌ పోస్టర్‌ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. తమిళ్, మలయాల, హిందీ మోషన్‌ పోస్టర్‌ లను కమల్‌ హాసన్‌, మోహన్‌ లాల్‌, సల్మాన్‌ ఖాన్‌ రిలీజ్ చేశారు. ఇక మోషన్ పోస్టర్ లో రజిని తన హీరోయిజంతో కేక పెట్టించాడు. ముఖ్యంగా పోలీస్‌ గెటప్‌ లో వెరీ స్టైలీష్ లుక్ బాగా ఆకట్టుకున్నాడు.

కాగా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఇక ర‌జ‌ని పాత్రలో మ‌రో షేడ్‌ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఆ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయ‌డానికి మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ పై రూపొందుతున్న ఈ చిత్రంలో రజని సరసన న‌య‌నతార హీరోయిన్‌ గా నటిస్తోంది. రజని – మురుగదాస్ కలయికలో వస్తోన్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఈ చిత్రంతో మరి ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.

తాజా వార్తలు